ప్రేమ, బాయ్ ఫ్రెండ్ గురించి తెలుగు నటి కామెంట్స్ వైరల్!
April 16, 2023 / 04:34 PM IST
|Follow Us
ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అనన్య నాగళ్ళ. ఆ సినిమాలో తెలంగాణ ఆడపడుచుగా ఎంతో చక్కగా నటించింది. అటు తర్వాత ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ‘వకీల్ సాబ్’ మూవీతో ఈమె ఇమేజ్ పెరిగింది. ఈమె పేరు కూడా మార్మోగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా.. అమాయకురాలు పాత్రలో కనిపించింది.
ఈ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో దూసుకుపోవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. అది నిజమే కానీ పెద్దగా గుర్తింపు ఉండే రోల్స్ రావడం లేదు.నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. ఇటీవల వచ్చిన ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. మరోపక్క సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఇటీవల అభిమానులతో సరదాగా ముచ్చటించింది ఈ అమ్మడు. ఈ క్రమంలో ఆమె ఫాలోవర్స్ లో ఒకరు ‘‘నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ ఏంటి?’’ అని ప్రశ్నించాడు. దీనికి అనన్య సమాధానం ఇస్తూ.. “బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. నాకు ఎవరూ ప్రపోజ్ కూడా చేయడం లేదు..’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.