Ananya Nagalla: అనన్య నాగళ్ళ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.. వైరల్.!

  • November 20, 2023 / 11:26 AM IST

ప్రియదర్శి హీరోగా రూపొందిన ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ళ. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ‘వకీల్ సాబ్’ మూవీతో ఈమె రేంజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా అమాయకురాలు పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో ఆమె దశ మారింది అనుకుంటే అది పొరపాటుగానే మిగిలింది.

ఆమెకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నా మాట నిజమే కానీ.. అవి లీడ్ రోల్స్ కాదు. నితిన్ ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’.. త్వరలో రాబోతున్న ‘శాకుంతలం’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.’శాకుంతలం’ సినిమాలో సమంత ఫ్రెండ్ గా నటించింది. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో యంగ్ పవిత్రగా అందాలు వడ్డించింది.

తాజాగా ‘అన్వేషి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేయడం లేదు. అయితే సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంది . ఈమె (Ananya Nagalla) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus