Anasuya: పెద్దకాపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనసూయ!

  • September 25, 2023 / 03:44 PM IST

టాలీవుడ్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె యాంకర్ గా కొనసాగుతూనే సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండితెరపైనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమె శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన పెద్దకాపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అనసూయ మైక్ తీసుకోగానే పెద్ద ఎత్తున అభిమానులు ఈలలు వేస్తూ గోల చేశారు. ఇలా అభిమానులు గోల చేయడంతో అనసూయ మాట్లాడుతూ మీరు నన్ను పొగుడుతున్నారో లేక ట్రోల్ చేస్తూ ఓ వేసుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదని ఈమె తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ రంగస్థలం సినిమాలో నటించినందుకు నన్ను అందరూ రంగమ్మత్త పాత్రలోనే గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన పెద్దకాపు సినిమాలో తాను అక్కమ్మ పాత్రలో నటించబోతున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ తన పాత్ర గురించి తెలియజేశారు.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను అక్కమ్మ గానే గుర్తు పెట్టుకుంటారు అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు. ఇలాంటి ఒక అద్భుతమైన పాత్ర చేసే అవకాశం నాకు కల్పించినందుకు శ్రీకాంత్ అడ్డాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus