Anasuya: హాట్ టాపిక్ గా మారిన అనసూయ ఎమోషనల్ వీడియో..!
October 4, 2022 / 05:03 PM IST
|Follow Us
అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఓ పక్క యాంకర్ గా బుల్లితెర పై అలరిస్తూనే మరో పక్క వరుస సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా అలరిస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్లతో ఈమె హాట్ టాపిక్ గా కూడా నిలుస్తుంటుంది.’లైగర్’ సినిమా టైంలో ఈమె లేపిన ఆంటీ వివాదం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
‘లైగర్’ సినిమా ప్లాప్ అయ్యింది అని అంతా ఆ సినిమాని ట్రోల్ చేస్తున్న టైంలో అనసూయ ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైంలో జరిగిన వివాదాన్ని లేవనెత్తి.. ఒక్కసారిగా ‘లైగర్’ హీరో విజయ్ దేవరకొండ పై సింపతీ కార్నర్ ఏర్పడేలా చేసింది. ఇది అనసూయతో కావాలనే ‘లైగర్’ టీం చేయించింది అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. అనసూయ కి తన భర్త సుశాంక్ అంటే చాలా ఇష్టం. వీరిది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే.
ఎప్పుడు అవకాశం వచ్చినా వరుసగా రొమాంటిక్ ఫోటో షూట్లలో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.తాజాగా అనసూయ షూటింగ్ పని మీద వేరే ఊరు వెళ్లినట్టు ఉంది. నైట్ టైం .. తన భర్త పక్కన లేకపోవడంతో .. దిగులుగా ఓ వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీంతో అనసూయ మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.