Anasuya: షర్ట్ చిరిగింది.. ఆ ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన అనసూయ?
October 18, 2022 / 08:08 PM IST
|Follow Us
బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం వెండితెరపై కూడా అవకాశాలను అందుకుంటు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక తనకు వెండి తెరపై వరుస అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పి ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకొనీ ఈమె ఎన్నోసార్లు నేటిజన్ల ట్రోలింగ్ కి గురైంది.ఇలా నెటిజన్లు ఈమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంటారు.ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎయిర్ పోర్ట్ లో తనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్ళినటువంటి
ఈమె తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం కోసం అలియన్స్ ఎయిర్ సంస్థకు సంబంధించిన ఫ్లైట్ లో టికెట్స్ బుక్ చేశానని తెలిపారు. ఈ ఫ్లైట్ సాయంత్రం 6.55 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది.ఇకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకే దగ్గర టికెట్స్ బుక్ చేశానని తెలిపారు. ఫ్లైట్ టేకాఫ్ కావలసిన సమయం కన్నా అరగంట లేటుగా వచ్చిందని అయితే అప్పటివరకు తాము బస్సులోనే ఉన్నామని తెలిపారు.ఫ్లైట్ టైం రాగానే లోపలికి వెళ్ళబోతుండగా సెక్యూరిటీ బయటే ఆపి మాస్క్ లేనిదే తనని లోపలికి పంపించమని చెప్పారు.
తిరిగి మాస్క్ తో లోపలికి వెళ్ళామని అనసూయ వెల్లడించారు.అయితే తాను అందరికీ ఒకే చోట టికెట్స్ బుక్ చేయగా అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కొక్కరిని ఒక్కోచోట కూర్చోబెట్టారంటూ ఈమె మండిపడ్డారు. అదేవిధంగా విమానంలో సీట్లు కూడా సరిగా లేవని అలా సీట్లు సరిగా లేని కారణంగా తన షర్ట్ కూడా చిరిగింది అంటూ ఈ సందర్భంగా అనసూయ అలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ వల్ల తనకు జరిగిన చేదు సంఘటనని ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
Sick sick protocol by @allianceair Flight no.9I517 origin BLR to HYD .. they made us run at 6:10pm and called it a last call at 6:20pm whereas the boarding time was given as 18:55 on the ticket.. the take off time is at 7:25.. made us wait in the bus for half an hour.. (1/4)