Anchor Lasya: యాంకర్ లాస్యకి ఏమైంది… ఆమె భర్త పోస్ట్ వైరల్..!
September 3, 2022 / 01:55 PM IST
|Follow Us
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ యాంకర్ గా రాణించింది లాస్య. ఇప్పుడు ఆమె హవా కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ‘బిగ్ బాస్ 4’ లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వరుస షోలతో బిజీగా మారింది. ఈమె క్యూట్ గా చెప్పే చీమ ఏనుగు జోక్స్ కు కొంతమంది అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. కేవలం లాస్య చెప్పడం వల్లనే ఆ జోక్స్ అంతగా పేలాయి అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా లాస్య బుల్లితెర పై ఎటువంటి షోలలో కనిపించడం లేదు. ఆమె తన యూట్యూబ్ ఛానెల్ ను డెవలప్ చేసుకునే పని పెట్టుకున్నట్టు ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ పాలయ్యిందనే షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు కూడా ‘ఏమైంది’ అంటూ ఆందోళన చెందుతున్నారు. లాస్య హాస్పిటల్ పాలైనట్లు చెప్పింది మరెవరో కాదు.. ఆమె భర్త మంజునాథ్.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో లాస్య హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసి ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ విషయం గురించి అతను ఇంకో కామెంట్ పెట్టలేదు. అందుకే ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘లాస్య త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
‘బిగ్ బాస్’ హౌస్ లో ఉన్న రోజుల్లో లాస్య తన లైఫ్ లో చాలా ట్రాజెడీ ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం, తర్వాత ఆర్థిక పరిస్థితుల రీత్యా రెండు సార్లు అబార్షన్ చేసుకున్నట్టు చెప్పి ఆమె షాక్ కు గురి చేసింది. ఇక పిల్లలు పుట్టరు అని కంగారు పడుతున్న టైంలో తనకు బాబు పుట్టాడు అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పిన సందర్భాలు లేవు.