Lasya: లాస్య చిన్న కుమారుడి పేరు ఏంటో తెలుసా?

  • April 7, 2023 / 07:31 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ లాస్య ఒకరు. కెరియర్ మొదట్లో యాంకర్ రవితో కలిసి మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమె అనంతరం ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇప్పటికే లాస్య మంజునాథ దంపతులకు జున్ను అనే ఓ కుమారుడు ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ చిన్నారి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.ఇకపోతే లాస్య తాజాగా మరొక మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. హోలీ పండుగ సందర్భంగా ఈమె తనకు మగ బిడ్డ పుట్టారు అంటూ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె కెరియర్ విషయానికి వస్తే…ఏదైనా స్పెషల్ అకేషన్స్ సమయంలో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తరచూ తనకు సంబంధించిన విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే లాస్య తాజాగా తన చిన్న కుమారుడు నామకరణానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. ఈ వీడియోలో భాగంగా లాస్య తన భర్త మంజునాథతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఒకే రకమైన ఔట్ ఫిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇలా మంజునాథ్ తన బాబుని ఎత్తుకోగా లాస్య (Lasya) తన పెద్ద కుమారుడి చేతిని పట్టుకొని నడుస్తూ వెళుతున్నటువంటి వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈమె తన బాబు నేమింగ్ సెర్మనీ అంటూ తన కొడుకు పేరును రివిల్ చేశారు. ఇక లాస్య తన కుమారుడికి మోక్ష్ అధీరన్ అనే పేరును పెట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus