Pradeep Father: టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం..!
May 2, 2021 / 12:02 PM IST
|Follow Us
స్టార్ యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పాండురంగ మాచిరాజు (వయసు 65) కరోనా భారిన పడి నిన్న రాత్రి కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం పాలయ్యి చికిత్స పొందుతూ వస్తున్నారట. వీటికి తోడు ఇటీవల కరోనా కూడా సోకడంతో.. పరిస్థితి మరింత విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతుంది. పాండురంగ మరణంతో ప్రదీప్ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.
టాలీవుడ్ నుండీ సినీ ప్రముఖులు ప్రదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మరోపక్క ప్రదీప్ కూడా కరోనా భారిన పడినట్టు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈయన యాంకర్ గా చెయ్యాల్సిన షోలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే వీటి పై ప్రదీప్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ఈ ఏడాది అతను హీరోగా వచ్చిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే.తన కొడుకు హీరోగా చేసిన చిత్రం విజయం సాధించడంతో ప్రదీప్ తండ్రి పాండురంగ గారు ఎంతో సంతోషించారట. ఈ విషయాన్ని తలుచుకుని ప్రదీప్ మరింత భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తుంది.