నిరాధారమైన రాతలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పదు: ప్రదీప్
August 27, 2020 / 08:01 PM IST
|Follow Us
ఓ యువతి ఏకంగా తనను 139 మంది లైంగికంగా వాడుకున్నారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం సంచలనంగా మారింది. దాదాపు 11ఏళ్లుగా కొందరు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది. తన ఎఫ్ ఐ ఆర్ లో దాదాపు అందరి పేర్లు ఆమె నమోదు చేయగా, వారిలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నారన్న వార్త అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. దీనితో పలు మీడియా సంస్థలు యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై కథనాలు రాయడం జరిగింది. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రావడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయనను తీవ్ర పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. అలాగే ప్రదీప్ కుటుంబ సభ్యులు, ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిరవధికంగా వస్తున్న కథనాలు, నిరాధార ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఓ వీడియో సందేశం ద్వారా తన ఆవేదన తెలియజేశారు. ప్రదీప్ ఈ వీడియోలో నిజానిజాలు తెలుసుకోకుండా రాతలు ఎలా రాస్తారు అని ప్రశ్నించారు. ఎవరో ఎదో చెప్పారు దాని వెనుక ఉన్నది, ఎవరు ఎందుకు చేయిస్తున్నారని తెలుసుకోకుండా నాపై, నా కుటుంబంపై విషం చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కోపం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆధారంగా లేకుండా ఈ స్థాయికి చేరిన నాపై ఎవరో ఎదో ఆరోపణ చేశారని, సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఎలా చేస్తారు అన్నారు.
సోషల్ మీడియా ట్రోలింగ్స్ ద్వారా కొందరు మానసికంగా మానభంగం చేస్తున్నారు అన్నారు. గతంలో కూడా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసారు అన్నారు. అలాగే వీడియో ద్వారా ఇకపై నిరాధార ఆరోపణలు, కథనాలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.ఇలాంటి రాతల వలన తనను అభిమానించే వారు బాధపడుతున్నారన్న ప్రదీప్,దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగుతానని చెప్పారు. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు రాసినా, ట్రోల్ల్స్ చేసినా చట్ట పరమైన చర్యలు తప్పవు అన్నారు.