Anchor Rashmi: అందుకే మిమ్మల్ని ప్రేమిస్తుంటా.. రష్మీ కామెంట్స్!
September 25, 2021 / 11:47 AM IST
|Follow Us
బుల్లితెర యాంకర్ గా రష్మీ కెరీర్ లో దూసుకుపోతుంది రష్మీ. గతంలో ఆమె కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ ఈ మధ్యకాలంలో వెండితెరకు దూరమైంది. కానీ టీవీ షోలలో బాగానే కనిపిస్తుంది. అలానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ గా షేర్ చేస్తుంటుంది. ఈమె జంతు ప్రేమికురాలు అనే సంగతి తెలిసిందే. రష్మీ సోషల్ మీడియాలో చేసే సేవా కార్యక్రమాలు, మూగజీవాల మీద చూపించే ప్రేమకు అందరూ ప్రశంసిస్తుంటారు.
తరచూ వీధి కుక్కల గురించి ఏదొక పోస్ట్ చేస్తూనే ఉంటుంది రష్మీ. వీధి కుక్కలకు ఏర్పడే సమస్యలపై స్పందిస్తుంటుంది. లాక్ డౌన్ లో అయితే ఆమె వీధి కుక్కల ఆకలి తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగింది. తాజాగా రష్మీ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్ ఓ విషయం ఉంది. వర్షాకాలం కావడంతో ఓ ఉద్యోగి రోడ్ మీద గొడుగు పట్టుకొని ఎదురుచూస్తున్నాడు. అతడి పక్కనే, ఓ గొడుగు కింద ఓ వీధి కుక్క కూడా నిల్చొని ఉంది.
దాన్ని తారామకుండా.. దానికి కూడా గొడుగు పట్టి వర్షంలో తడవకుండా చూసుకున్నాడు. ఇంకా ఇలాంటి వారున్నారంటూ రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్ మీద రష్మీ స్పందించింది. అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి సాధారణ వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు.. వీధికుక్కలు కోసం కూడా ఆలోచిస్తున్నారు.. అందుకే ఆయన్ని ప్రేమిస్తున్నా అంటూ రాసుకొచ్చింది.