Anchor Rashmi: 37 లక్షలమంది ఉన్నారు… తలచుకుంటే పెద్ద విషయం కాదు!
August 18, 2021 / 12:08 PM IST
|Follow Us
బుల్లి తెర యాంకర్ రష్మీకి… మూగజీవాలంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైమ్‌లో శునకాలు, పెంపుడు జంతువుల కోసం ఆహారం పెట్టి తన మంచి మనసు చాటుకుంది. అంతేకాదు ఆ తర్వాత కూడా శునకాలంటే తనకున్న కేరింగ్నెస్ని చూపించింది. మొన్నీమధ్య ఇలాంటి ఓ సంఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను సాయం కూడా అడిగింది రష్మి. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నం చేసింది ఈ హాట్ యాంకర్. ఇషాన్ అనే శునకం ఇటీవల గాయపడగా దాన్ని చూసి రష్మి కలత చెందింది.
దాని చికిత్స కోసం దానం చేయండంటూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానుల్ని, నెటిజన్లను అభ్యర్థించింది. నెల క్రితం ఓ కన్స్ట్రక్షన్ సైట్లో ఇషాన్ అనే శునకం ఆరో అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. దీంతో ఆ శునకానికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుండి దాని చికిత్సకు రోజుకి ₹300-₹400 ఖర్చవుతోందట. తన వంతు సాయం చేస్తున్న రష్మి. ఇంకా సాయం అవసరం అవుతుండటంతో నెటిజన్లను అభ్యర్థించింది. నా వంతు సాయం నేను చేస్తున్నా… మీరూ చేస్తారని ఆశిస్తున్నా.
ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు సుమారు 38 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు. అందరం కలిసి సాయం చేద్దాం అంటూ పిలుపునిచ్చింది రష్మి. అంతే కాదు చికిత్స పూర్తయిన తర్వాత ఇషాన్‌ని అలా వదిలేయకుండా తగిన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పింది.