బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. అతడు కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతడు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. హౌస్ లో ఉన్నంతకాలం అతడిని ఇన్ఫ్లూయెన్సర్, నారదుడు ఇలా రకరకాల పేర్లతో ఏడిపించేవారు. అయినప్పటికీ రవి తన సహనం కోల్పోకుండా తన గేమ్ తను ఆడుకున్నాడు. లహరి ఎపిసోడ్ అతడిపై కొంత ఇంపాక్ట్ చూపినా.. ఆ తరువాత ఇష్యూ సెటిల్ అయిపోయింది.
హౌస్ లో ఎప్పుడైతే రవి భార్య నిత్య, కూతురు వియా వచ్చారో రవిపై క్రేజ్ కాస్త పెరిగింది. అతడిపై పాజిటివిటీ పెరుగుతున్న సమయంలో సడెన్ గా హౌస్ నుంచి పంపించేసి షాకిచ్చారు బిగ్ బాస్. బయటకొచ్చిన తరువాత రవి పలు ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. తన కూతురుపై జరిగిన ట్రోలింగ్ పై మండిపడ్డాడు. ఫ్యామిలీ జోలికి రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో తననొక వ్యక్తి మోసం చేసిన విషయాన్ని బయటపెట్టాడు రవి. తనతో ఎంతో నమ్మకంగా ఉండే ఓ వ్యక్తి బిజినెస్ పెట్టాలని,
పరిస్థితి బాగాలేదని చెప్పి డబ్బు అడిగాడని రవి తెలిపాడు. రెండేళ్లుగా ఆ వ్యక్తితో పరిచయం ఉందని.. ఎలాంటి అలవాట్లు లేని వాడని, రోజూ గుడికి కూడా వెళ్తాడని, బాగా నమ్మకస్తుడని నమ్మి రూ.45 లక్షలు ఇచ్చాడట రవి. ఇరవై రోజుల్లో తిరిగిస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని.. నమ్మకస్తుడని లెక్కపత్రం కూడా తీసుకోకుండా డబ్బిచ్చానని.. కానీ అతడు మోసం చేశాడని రవి చెప్పుకొచ్చాడు.