Lasya: లాస్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి..!
May 5, 2021 / 07:33 PM IST
|Follow Us
‘స్టార్ మా’ ఛానల్ ‘మా టీవీ’ గా పిలువబడుతున్న రోజుల్లో ‘సంథింగ్ స్పెషల్’ అంటూ ఓ మ్యూజికల్ షో టెలికాస్ట్ అయ్యేది. దీని ద్వారా పరిచయమయ్యారు యాంకర్ లాస్య, యాంకర్ రవి. కొద్దిరోజుల్లోనే ఈ షో ద్వారా వీళ్ళు మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే తరువాత వీళ్లిద్దరి మధ్య.. సంథింగ్ సంథింగ్ మొదలైంది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. నిజం లేదు కానీ.. ఆ రూమర్స్ ను షో నిర్వాహకులు బాగా క్యాష్ చేసుకున్నారు.దాంతో వీళ్ళు ఏకంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి.
అందుకేనేమో గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి ఏ షో చెయ్యలేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే తాజాగా కాజల్ ఆర్ జె యూట్యూబ్ ఛానల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో యాంకర్ లాస్య పై రవి చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రవి మాట్లాడుతూ.. “లాస్య ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ ఇంట్లో కూడా ఈమె అలాగే ఉంది. నేను అది గమనించాను. ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి, తన ఊరు గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
పదే పదే మాకు కూడా వాటి గురించే చెబుతుండేది. లాస్య నాకు 10 ఏళ్ళుగా తెలుసు. ఆమె ఇప్పుడు మన ముందు ఇలా కూర్చుని ఉన్నా.. మనతో మాట్లాడుతున్నా.. ఆమె మనసులో మాత్రం తన నాన్నగారి గురించి లేదా ఆమె ఊరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన ఊరికి ఏదో ఒకటి చేయాలని ఈమె బలమైన కోరిక. ఇక్కడ ఏదో ఒకటి సాధించిన వెంటనే తన ఊరికి వెళ్లి అభివృద్ధి చెయ్యాలని భావిస్తుంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.