Bigg Boss 5 Telugu: రవి ఎలిమినేట్ అవుతూ చెప్పిన మాటలు ఏంటో తెలుసా..?
November 29, 2021 / 10:43 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ అనేది అందరిలోనూ ఉత్కంఠని రేకెత్తించింది. కాజల్, ఇంకా రవి ఇద్దరూ మాత్రమే మిగిలినపుడు హౌస్ మేట్స్ లెక్కలు వేశారు. సన్నీ కాజల్ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడతాను అని చెప్తే, వద్దు నేను పబ్లిక్ డెసీషన్ కి రెస్పెక్ట్ ఇస్తాను అంటూ కాజల్ చెప్పింది. దీంతో ఇద్దరి మద్యలో కాసేపు వాదన జరిగింది. ఆ తర్వాత కింగ్ నాగార్జున సన్నీని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వాడుతున్నావ్ అని అడిగితే కాజల్ కి అంటూ కాజల్ దగ్గర పాస్ పెట్టేశాడు.
కానీ, కాజల్ అనూహ్యంగా పబ్లిక్ ఓటింగ్ తో సేఫ్ అయ్యింది. రవి ఎలిమినేట్ అయ్యాడు.ఇక రవి ఎలిమినేట్ అవ్వగానే హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా షాక్ తిన్నారు. కన్నీళ్లతో రవిని హౌస్ నుంచీ పంపించారు. స్టేజ్ పైకి వచ్చిన రవి అస్సలు ఇది నేను ఊహించలేదంటూ నాగార్జునతో చెప్పాడు. ఇంకొన్ని వారాలు ఉంటానని అనుకున్నాను అని, ఇది ప్రేక్షకుల నిర్ణయం కాబట్టి నేను గౌరవిస్తాను అంటూ చెప్పాడు. బిగ్ బాస్ లో తన జెర్నీని చూసుకుని భావోద్వేగానికి గురి అయ్యాడు.
ఇక హౌస్ లో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అనే గేమ్ ఆడాడు రవి. షణ్ముక్ కి ఫస్ట్ పెట్టి నాకు బ్రదర్ దొరికాడు అని చెప్పాడు. ఇక్కడే షణ్ముక్ తనవల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించమని వేడుకున్నాడు. నేను వెళ్లిపోతేనే నువ్వు విన్నర్ అవుతావ్ షణ్ముక్ అంటూ ధైర్యం చెప్పాడు రవి.అలాగే, శ్రీరామ్ తో మాట్లాడుతూ లేట్ గా కనెక్ట్ అయినా చందు నాకు మంచి బ్రదర్ అయ్యాడని, అన్నీ పాజిటివ్ వైబ్స్ తోనే ఉంటాడని చెప్పాడు.
ఇక నువ్వు లోపల గేమ్ ఆడు, నేను బయట నుంచీ సపోర్ట్ చేస్తా అంటూ భరోసా ఇచ్చాడు. సన్నీ హౌస్ లో తోపు అంటూ పాస్ సింబల్ పెట్టాడు. ఫ్రెండ్ అంటే చాలు, ప్రాణం ఇచ్చేస్తాడు సన్నీ అంటూ మాట్లాడాడు రవి. మానస్ కి నువ్వు ఇన్సిపిరేషన్ అంటూనే ఫెయిల్ ట్యాగ్ పెట్టాడు. తర్వాత ప్రియాంక, సిరి, కాజల్ కు ఫెయిల్ పెడుతూ వాళ్ల గేమ్ ని ఎక్కడ ఇంప్రూవ్ చేస్కోవాలో చెప్పాడు.