Anchor Siva: కెప్టెన్సీ టాస్క్ లో అరియానా లొల్లి..! అసలు మేటర్ ఏంటంటే..?
April 15, 2022 / 11:15 AM IST
|Follow Us
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా అనూహ్యంగా నిలిచింది. ఆఖరి ఛాలెంజ్ లో భాగంగా అన్ని జంటలు జెండా గేమ్ లో పాల్గొన్నాయి. హౌస్ మేట్స్ వేసుకున్న జాకెట్ లో జెండాలని వేరే హౌస్ మేట్స్ తీస్కోవాల్సి ఉంటుంది. అందరూ కళ్లకి గంతలు కట్టుకుని ఉంటారు. ఇక్కడే అజయ్ అరియానా జంటలో ఆడేందుకు అరియానా వచ్చింది. అలాగే, మిత్రా – మహేష్ జంటలో మిత్రా ఆడటానికి వచ్చింది. ఈ గేమ్ సంచాలక్ గా ఉన్న అషూ ఎప్పటిలాగానే చాలా కన్ఫూజన్ కి గురి అయ్యింది.
రెండు మూడుసార్లు గేమ్ ని పాజ్ చేసింది. అందరూ కళ్లకి గంతలు కట్టుకుని ఫ్లాగ్స్ సంపాదిస్తుంటే ఉన్నట్లుండి గేమ్ పాజ్ అంటూ అరిచింది అషూరెడ్డి. అసలు గేమ్ ఎందుకు పాజ్ చేసిందనేది కారణం చెప్పలేదు. అలాగే, అరియానా కరెక్ట్ గా అనిల్ ని లాక్ చేసే టైమ్ కి పాజ్ అనేసరికి అరియానాకి మండింది. గేమ్ పాజ్ చేసినపుడు మళ్లీ అక్కడ్నుంచే స్టార్ట్ చేయాలి కదా లాజిక్ మాట్లాడింది. లొల్లి చేసింది. చాలా సేపు ఇద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. ఆ తర్వాత రౌండ్ లో అనిల్ తన జెండాని పీకి చేతిలో పెట్టుకున్నాడు.
దీంతో అనిల్ ని హమీదాని డిస్ క్వాలిఫై చేసింది సంచాలక్ అషూ. నిజానికి టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచీ హమీదా రింగ్ బయట నుంచీ అరుస్తూనే ఉంది. అషూరెడ్డి చూడటం లేదని నింద వేస్తునే ఉంది. అషూని గుక్క తిప్పుకోనివ్వకుండా మాట్లాడుతూ రెచ్చిపోయింది. తన టీమ్ మెంబర్ అనిల్ ని డిస్ క్వాలిఫై చేసే సరికి ఉగ్రరూపం దాల్చింది. అషూని మాటలతో రెచ్చగొట్టింది. సంచాలక్ గా కరెక్ట్ గానే నిర్ణయం తీస్కున్నానని చెప్పింది అషూ. ఫైనల్ గా ఈ టాస్క్ లో వేరే వాళ్లవి రెండు జెండాలని పీకిన నటరాజ్ మాస్టర్ ఇంకా శివలు గేమ్ గెలిచారు.
బిందు – అఖిల్ జంట ఏరియాని కైవసం చేసుకుని వారిని గేమ్ నుంచీ అవుట్ అయ్యేలాగా చేశారు. దీంతో అఖిల్ – బిందు ఇధ్దరూ కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకున్నారు. ఇక రెండు ఏరియాలని దక్కించుకున్న నటరాజ్ మాస్టర్ – శివ, మిత్రా – మహేష్ లు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. కేవలం ఒక్క ఏరియాని మాత్రమే ఉంచుకున్న హమీదా అనిల్ ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీకోసం రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హమీదా అనిల్ కి అవకాశం ఇచ్చింది.
కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా బిందు వ్యవహరించింది. చేతులు కాళ్లు కట్టేసిన సంచి నుంచీ బయటకి రాకుండా గార్డెన్ ఏరియాలో లైన్ ని క్రాస్ చేసి పైకి లేచి నుంచోవాలి. ఈ టాస్క్ లో అందరికంటే ముందు నటరాజ్ మాస్టర్ లైన్ క్రాస్ చేసి వచ్చారు. కానీ, పైకి లేవడంలో చాలా కష్టపడ్డారు. అలాగే, అనిల్ ఇంకా మహేష్ ఇద్దరూ పైకి లేచినా కూడా చేతులు బయటకి వచ్చేశాయి కాబట్టి బిందు మాధవి కన్సిడర్ చేయలేదు.
దీంతో లేట్ గా లేచినా కూడా శివ కెప్టెన్ అయ్యాడు. నటరాజ్ మాస్టర్, మిత్రా ఇద్దరూ పైకి లేవలేకపోయారు. కొత్త కెప్టెన్ గా అయిన శివ చాలా వారాల నుంచీ ఎదురుచూస్తున్నాను అని బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. మహేష్ ఈసారి జస్ట్ మిస్ అయితే, శివ ఏడోసారి పార్టిసిపేట్ చేసి కెప్టెన్ అయ్యాడు. దీంతో బిందు మాధవి అండ్ టీమ్ సంబరాలు చేసుకుంది. అదీ మేటర్.