Sowmya Rao: టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా… సౌమ్య రావు కామెంట్స్ వైరల్!

  • December 29, 2023 / 01:25 PM IST

బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షోగా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం దాదాపు 14 సంవత్సరాల క్రితం ప్రారంభమై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అవ్వడమే కాకుండా ప్రస్తుతం వారంతా కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగాను డైరెక్టర్లు కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

ఈమెకు కూడా సినిమా అవకాశాలు రావడంతో ఈమె కూడా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెబుతూ వెండితెరపై బిజీ అయ్యారు. ఇక అనసూయ వెళ్ళిపోవడంతో సౌమ్యరావుని ఈ కార్యక్రమానికి యాంకర్ గా పరిచయం చేశారు. ఈమె కూడా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. సౌమ్యరావు వెళ్లిపోవడంతో తన స్థానంలో బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన సిరి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు

అయితే సౌమ్యరావు వెళ్లిపోవడంతో అభిమానులు ఎంతో ఫీలవుతున్నారని దీంతో సోషల్ మీడియా వేదికగా మీరు జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రండి అంటూ కూడా ఈమెను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఒక నెటిజన్ మీరు జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి రావాలి అంటూ ఈమెను ప్రశ్నించడంతో వెంటనే ఈమె కూడా ఈ విషయంపై స్పందిస్తూ టైం వచ్చినప్పుడు తప్పకుండా తిరిగి వస్తాను అంటూ కామెంట్ చేశారు

ఇలా ఈమె కామెంట్ చేశారు అంటే తన వ్యక్తిగత విషయాలు కారణంగానే ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారా అందుకే తిరిగి వస్తానని చెబుతున్నారా అంటూ చాలామంది ఈమె (Sowmya Rao) ఇచ్చిన సమాధానం పై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus