సుమ ఎన్టీఆర్ ను కూడా టార్గెట్ చేసిందిగా..!

  • November 15, 2019 / 11:47 AM IST

‘టీఆర్ఎస్’ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘హరితహారం’ అనే కార్యక్రమం పై ప్రజ్నదరికీ అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ఉద్యమాన్ని ‘గ్రీన్ ఛాలెంజ్’ పేరుతో సోషల్ మీడియాలో కొనసాగిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఇందులో పాల్గొంటుండడం విశేషం.

ఇక సినీ ఇండస్ట్రీ నుండీ ఇప్పటికే సాయి పల్లవి, వరుణ్ తేజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు వంటి సెలబ్రిటీలు మొక్కలు నాటి విజయవంతంగా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు యాంకర్ సుమ వంతు వచ్చింది. సహజనటి జయసుధ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన సుమ.. ఉషాకిరణ్ మూవీస్ కు సంబంధించిన మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటింది. ఇదే క్రమంలో సుమ కూడా హీరో జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, రాహుల్ సిప్లిగంజ్, ఓంకార్ లకు ఈ ఛాలెంజ్ ను విసిరింది. ఇక సంతోష్‌ కుమార్‌కు కూడా సుమ కృతజ్ఞతలు చెప్పింది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus