Anchor Syamala: ఆ మీమ్ పై సూపర్ సెటైర్ వేసిన శ్యామల..?
May 8, 2021 / 07:32 AM IST
|Follow Us
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఒకేలా ఉండకపోయినా కొంతమంది చూడటానికి ఒకే పోలికలతో కనిపిస్తూ ఉంటారు. ప్రముఖ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్, బుల్లితెర యాంకర్, నటి శ్యామల బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉంటారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. బుల్లితెర సీరియల్స్ లో నటించడం ద్వారా, మాఊరి వంట ప్రోగ్రామ్ ద్వారా శ్యామల ప్రేక్షకులకు చేరువయ్యారు. హోమ్లీగా కనిపించే శ్యామలకు బిగ్ బాస్ షో సీజన్ 2లో పాల్గొన్న తరువాత క్రేజ్ మరింత పెరిగింది.
సోషల్ మీడియాలో కూడా శ్యామల యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో శ్యామల భర్త ఒక కేసులో అరెస్ట్ కావడంతో ఆమె పేరు మీడియాలో ఎక్కువగా వినిపించింది. అయితే సోషల్ మీడియాలో శ్యామలకు సంబంధించిన ఒక మీమ్ వైరల్ అవుతుండగా ఆ మీమ్ పై శ్యామల సెటైర్ వేశారు. వైరల్ అయిన మీమ్ లో శ్యామల, భువనేశ్వర్ కుమార్ బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారని ఉంది.
ఆ మీమ్ పై శ్యామల స్పందిస్తూ మేము బ్రదర్ అండ్ సిస్టర్ అవుతామని మాకే తెలియదని మీకు ఎలా తెలిసిందంటూ శ్యామల పేర్కొన్నారు. శ్యామల కౌంటర్ తో ఆ మీమ్ చేసిన వాళ్లకు ఝలక్ ఇచ్చారనే చెప్పాలి. మరోవైపు శ్యామల ప్రస్తుతం బుల్లితెర షోలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గతంతో పోలిస్తే శ్యామలకు ఆఫర్లు తగ్గాయో లేక ఆమె కావాలనే బుల్లితెర షోలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారో తెలియాల్సి ఉంది.