వాళ్ళతో హాయ్.. బాయ్ తప్ప… అంత ఫ్రెండ్ షిప్ లేదు : వర్షిణి
July 14, 2020 / 10:57 AM IST
|Follow Us
‘చందమామ కథలు’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ తదితర చిత్రాల్లో నటించినప్పటికీ.. నటిగా ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది యాంకర్ వర్షిణి. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి చేసిన ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు తరువాత యాంకర్ అవతారం కూడా ఎత్తింది ఈ బ్యూటీ. ‘పటాస్’ ‘ఢీ’ వంటి షోలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది వర్షిణి. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా వర్షిణికి..
అలాగే ఆమె తోటి యాంకర్లు అయిన శ్రీముఖి, విష్ణు ప్రియలతో గొడవలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది వర్షిణి. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.. ” శ్రీముఖి, విష్ణుప్రియ లతో నాకు గొడవలు జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలా అని నాకు వాళ్లిద్దరితో స్నేహం కూడా లేదు. ఏదో.. హాయ్, బాయ్ చెప్పుకోవడం తప్ప వారితో అంత సాన్నిహిత్యం ఏమీ లేదు.
ఇక ‘ఇప్పుడున్న యాంకర్లకు ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే.. ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తారు?’ అని వర్షిణి యాంకర్ ప్రశ్నించగా.. ‘సుమకు 1, ఝాన్సీ2, శ్రీముఖి3, రష్మి4, అనసూయ5, ల ర్యాంకులు ఇచ్చి.. 6 నేను.! ఇక విష్ణుప్రియకు ఆఖరి ర్యాంక్’ ఇస్తున్నట్టు వర్షిణి తెలిపింది. ఈ క్రమంలో యాంకర్… ‘విష్ణుప్రియకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చారేంటి?’ అని ప్రశ్నించగా.. ‘లేకపోతే లాస్ట్ ర్యాంక్ నాకు ఇచ్చుకోమంటారా ఏంటి? అంటూ సరదాగా స్పందించింది వర్షిణి.