ఆ డైరెక్టర్ చేయి పట్టుకొని లాగాడు!

  • October 27, 2020 / 03:06 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఎదురవుతాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ బాధితుల్లో యాంకర్లు కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో హాట్ యాంకర్ వర్షిణి కూడా చేరిపోయింది. కెరీర్ పరంగా ఈ మధ్యకాలంలో వర్షిణి బాగా పాపులర్ అయింది. ఆ మ‌ధ్య ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. యాంక‌ర్ గా కూడా ఫామ్ లోకి వ‌చ్చింది. కొన్ని ఛానెల్స్ లో టాప్ షోలలో యాంకర్ గా కనిపిస్తోంది. తన హాట్ లుక్స్ తో బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.

ఇండస్ట్రీలో కాస్త ఫేమ్ ఉన్న ఈ బ్యూటీకి కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన జీవితంలో ఇప్పటివరకు ఎదురైన చేదు జ్ఞాపకం అదొక్కటేనని చెబుతోంది. ఓ వెబ్ సిరీస్ లో నటించే ఆఫర్ రావడంతో.. వెళ్లి దర్శకుడ్ని కలిసిందట వర్షిణి. కాసేపు తనతో మాట్లాడిన తరువాత.. తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట. లాక్ డౌన్ కి ముందు ఈ ఘటన జరిగిందని చెప్పింది.

సదరు దర్శకుడు తన చేయి పట్టుకొని లాగాడని.. దీంతో వెంటనే అక్కడ నుండి బయటకి వచ్చేసినట్లు వర్షిణి చెప్పుకొచ్చింది. కారులో కూర్చొని ఏడ్చానని.. ఇప్పటివరకు తనకు ఎలాంటి అనుభవం ఎదురుకాలేదని.. చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి పేరెంట్స్ కి కూడా చెప్పుకోలేకపోయానని.. కేవలం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వర్షిణి బయటపెట్టలేదు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus