బికినీతో బెంబేలెత్తించిన హాట్ యాంకర్

  • February 10, 2018 / 01:03 PM IST

ఇప్పుడు సినిమా హీరోయిన్లతో సమానంగా టీవీ యాంకర్లు కూడా కుర్రకారుని ఆకట్టుకునే పనిలో పడ్డారు. రేష్మి, అనసూయ ఒక పక్క టీవీ షోలకి యాంకరింగ్ చేస్తున్న మరో పక్క సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కొత్తగా ఢీ10 భామ వర్షిణి కూడా వచ్చి చేరింది. ఢీ 10 డాన్స్ షోలో రేష్మి, ప్రదీప్, సుధీర్ లతో పాటు యాంకర్ గా చేస్తున్న వర్షిణి తాజాగా బికినీ లో దర్శనమిచ్చి ఝలక్ ఇచ్చింది. బీచ్ లో బికిని వేసుకొని వయ్యారంగా దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇవి చూసి కుర్రకారు వర్షిణి ఇంట హాట్ గా వుంటుందా అని నోళ్లు వెళ్ళబెట్టుకుంటున్నారు.

డ్యాన్స్ షోకి యాంకర్ అవ్వడానికి ముందు పలు సినిమాల్లో నటించిన వర్షిణి, సదరు సినిమాలతో పెద్దగా పేరు రాకపోవడంతో యాంకిరింగ్ వైపు అడుగులేసింది. అయితే.. ఒక షో హోస్ట్ చేసేందుకు కావాల్సిన టాలెంట్ లేకపోవడంతో కురచ దుస్తుల్లో ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. కేవలం టీవీ షోలకు పరిమితం అయిపోవడం ఇష్టం లేదో లేక సినిమాల్లో ఆఫర్ల కోసం కాస్త గట్టిగా ట్రై చేస్తుందో ఏమో కానీ.. రీసెంట్ గా మలేసియా వెళ్ళి అక్కడ బీచ్ లో టూ పీస్ బికినీతో ఫోటోలు దిగి ఇంటర్నెట్ లో వదిలి తాను గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ ఇంటిమేషన్ ఇచ్చింది. మరి వర్షిణి ఆరబోస్తున్న అందాలను చూసి ఎవరైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus