Shaakuntalam: ‘శాకుంతలం’ మూవీలో వర్షిణి… ఏ పాత్రలో అంటే?

  • August 4, 2021 / 03:57 PM IST

యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.’శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో నటించి అటు తర్వాత ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ మధ్య కాలంలో ‘ఢీ’ వంటి షోలతో బుల్లితెర పై ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి అలాగే ఆమె అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీలో ఈమె కీలక పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె సమంత తల్లిగా నటించబోతున్నట్టు మొదట్లో ప్రచారం జరిగింది. వర్షిణి వయసు 27 .. సమంత వయసు 34.. ఈమె ఆమెకు ఎలా తల్లిగా సెట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సమంత తల్లి పాత్రకి సీనియర్ హీరోయిన్ మధుబాలని ఎంపిక చేసుకున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.

అయితే వర్షిణి సమంత తల్లిగా కాదు గాని మధుబాల పాత్రకి సోదరిగా కనిపించబోతుందని వినికిడి. ఆ రకంగా చూసుకున్నా సమంతకి తల్లి పాత్రలాంటిదే అనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..!

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus