ఇండస్ట్రీ అంటేనే…పోటీ…అది వెండి తెర అయినా, బుల్లి తెర అయినా, యాంకర్ నుంచి సెలెబ్రెటీస్ వరకూ ఎవరు పాత్రలక్కు వారు న్యాయం చేసుకుంటూ పోవాలి లేదంటే ఏమాత్రం తేడా వచ్చినా కష్టం అయిపోతుంది. ఇదిలా ఉంటే అసలు విషయంలో కి వెళితే ఒకప్పుడు యాంకర్స్ ఎంతో అందంగా, ముస్తాబు అయ్యి, కట్టుబొట్టుతో అందరినీ అలరించేవారు. అయితే కాలానుగుణంగా మార్పు అనుకోవాలో, లేక కుర్రకారె టార్గెట్ అనుకోవాలో తెలీదు కానీ, మొత్తానికి ఈటీవీలో ప్రసారం అవుతున్న టాప్ కామిడీ షో ‘జబర్దస్త్’ పుణ్యమా అని కట్టు బొట్టు కాస్త పోయి, అందాల ఆరబొతలు ఎక్కువైపోయాయి, ఇక వారిలో హాట్ సెక్సీ యాంకర్స్ రేష్మి, అనసూయలు వీలైనంతవరకూ విప్పి చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే అదే క్రమంలో వీరి అందాలకు ఫిదా అయిపోయిన టాలీవుడ్ వరుస ఆఫర్స్ సైతం ఇస్తూ వీళ్ళని ఎన్కరేజ్ చేస్తున్నారు. అయితే తాజాగా రేష్మి హాట్ పాత్రలో రెచ్చిపోతే, అనసూయ మంచి క్యారెక్టర్ లో అలరించింది. ఇక వీళ్ళిద్దరికీ చెక్ పెడుతూ తెరపైకి వస్తుంది మరొక యాంకర్ “శ్రీముఖి”. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా సక్సెస్ అయినా పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ‘పటాస్’ వంటి కామెడీ షోలలో ఇరగదీస్తూ, అదే క్రమంలో మంచి పాత్రల్లో వెండి తెరపై కనిపిస్తుంది.
తాజాగా ఈ భామ మన నాని నటించిన “జెంటిల్ మ్యాన్’ లో కనిపించింది. ఇక ఈ మధ్య రేష్మి, అనసూయలు ఇద్దరూ వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంటే, వారి గ్యాప్ ని బుల్లి తెరపై ఫిల్ చేయడానికి శ్రీముఖి కు మంచి అవకాశం అనే చెప్పాలి. మరోపక్క ఇండస్ట్రీలో ఉన్నాక కాస్తంత అందాల ఆరబోత కూడా ఉండాలి కాబట్టి.. ఈమధ్య ఎక్స్పోజింగ్ డోస్‌ని కూడా శ్రీముఖి పెంచినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా….దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఇదే.