Anil Ravipudi: హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి కామెంట్స్..!

  • May 31, 2022 / 07:19 PM IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్3’ మూవీ మే 27న విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన ఈ మూవీ ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చినా లాజిక్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. దీంతో మూవీకి భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

దీంతో సోమవారం నాడు ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నాకు 3 ఫ్యామిలీలు. థంబ్ నెయిల్స్ పెట్టుకోండి. మొదటి ఫ్యామిలీ ఇంట్లో ఉంది. రెండో ఫ్యామిలీ స్టేజి పై ఉంది. మూడో ఫ్యామిలీ ప్రేక్షకులు. ఇది నా కెరీర్లో 6వ సినిమా. ఉద‌య‌మే నాకు ఒక ఫోన్ కాల్ వ‌స్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌. నాకు ప్ర‌తిసారీ వి.వి. వినాయ‌క్‌గారు చేస్తుంటారు. ఆరోసారి కూడా ఆయనే చేశారు.

ఇంకా చాలామంది ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు ప‌ర్స‌న‌ల్‌గా కాల్ చేశారు. డి.సురేష్‌బాబుగారు సినిమా విడుద‌ల‌కు ముందే చూసి హిట్ అన్నారు. ఇప్పుడు నా సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు. 27న విడుద‌లైన మా సినిమా ఈరోజు కూడా కలెక్షన్లు అదరగొడుతుంది. ఈ వీక్ కూడా ఎగ్జిబిట‌ర్ల‌కు, కొన్న పంపిణీదారుల‌కు క‌లెక్ష‌న్ల‌తో న‌వ్వులు పూయించాల‌ని కోరుకుంటున్నాను. నైజాంలో దాదాపు 9ల‌క్ష‌ల 50వేల మంది మా ‘ఎఫ్3’ సినిమాని చూశారు.

పాండ‌మిక్ త‌ర్వాత సినిమారంగం ఇబ్బందిలో పడింది. అందుకే ప్ర‌తి సెక్ష‌న్‌కు సినిమా చేరువ‌కావాల‌ని కోరుకున్నాం. ‘అఖండ‌’, ‘పుష్ప‌’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’., ‘భీమ్లా నాయ‌క్‌’,’కె.జి.ఎఫ్ చాప్టర్ 2′, ‘స‌ర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను థియేటర్ కు తీసుకొచ్చాయి. ఇప్పుడు మా ‘ఎఫ్‌3’ కూడా తీసుకొస్తుంది. తెలుగు సినిమాకు పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు నా స్పెషల్ థ్యాంక్స్‌” అంటూ చెప్పుకొచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus