ఈ మధ్యకాలంలో దర్శకుడు అనీల్ రావిపూడికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకొని తన సినిమా పనుల్లో పడ్డాడు. అయితే కరోనా సమయంలో తను ఎదుర్కొన్న పరిస్థితులు గురించి వివరించాడు. కొంతమంది హీరోలు ఫోన్ చేసి పరామర్శించారని.. మహేష్ బాబు ఫోన్ చేసి కామెడీ చేశారని చెప్పుకొచ్చాడు. మహేష్ పరామర్శ కొత్తగా ఉంటుందని.. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దాని నుండి బయటకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తారని చెప్పాడు.
తను బాధలో ఉన్నాననే ఆలోచనతో ముందు క్యాజువల్ గా మాట్లాడారని.. ఆ తరువాత కామెడీ మొదలుపెట్టారని అనీల్ చెప్పుకొచ్చాడు. మీరెక్కడికి వెళ్లారు..? మీరెందుకు తగిలించుకున్నారంటూ కామెడీ చేసేవాడని తెలిపాడు. మూడు, నాలుగు రోజులకు ఒకసారైనా గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేసి మహేష్ మాట్లాడేవారని.. ఆ సమయంలో తనలో కాన్ఫిడెన్స్ పెంచిన వ్యక్తి మహేష్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అలానే వరుణ్ తేజ్, వెంకటేష్ ఫోన్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
తనకు కరోనా వచ్చిన సమయానికి వరుణ్ తేజ్ కి కరోనా వచ్చి తగ్గిపోయిందని.. తనకు కొన్ని సలహాలు ఇచ్చేవారని చెప్పాడు. ఇక వెంకటేష్ గారు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉందని చెప్పిన విషయాన్ని బయటపెట్టాడు. కరోనా రావడం ఒక బాదైతే.. ఐసొలేషన్ లో ఉంటూ పిల్లలకు దూరంగా ఉండడం ఇంకా పెద్ద బాధని చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!