అనిల్ రావుపూడి దర్శకత్వంలో రామ్!

  • June 9, 2016 / 08:55 AM IST

“పటాస్, సుప్రీమ్” వంటి వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న యువ ప్రతిభాశాలి అనిల్ రావిపూడి మరో యంగ్ హీరో డేట్స్ సంపాదించాడు. ఈ ఏడాది ఆరంభంలో “నేను శైలజ”తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న రామ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు సమ్మతించాడని తెలుస్తోంది. ఈ సినిమాను రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తారని సమాచారం.

“సుప్రీమ్” సినిమా ఎబౌ యావరేజ్ సినిమా అయినప్పటికీ.. ఆ సమయంలో మరో సినిమా లేకపోవడం పుణ్యమా అని “సుప్రీమ్” భారీ లాభాలు సంపాదించిపెట్టింది. దాంతో.. అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల లిస్ట్ లో సక్సెస్ ఫుల్ గా చేరిపోయాడు. ఇప్పుడు యువ కథానాయకుడు రామ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకొని.. జాబితాలో ఇంకాస్త ముందుకు ఎగబాకాడు. రామ్ సినిమా కూడా హిట్ అయ్యిందంటే.. అనిల్ అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోవడం ఖాయం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus