ప్రమోషన్స్ కోసం టీజర్లు కాక స్కిట్లు రిలీజ్ చేస్తే ఎలా
October 30, 2019 / 03:25 PM IST
|Follow Us
ఒక సినిమాకి ప్రమోషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా దర్శకనిర్మాతలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ బాగుండి, కంటెంట్ కి జనాలు కనెక్ట్ అవ్వగలిగితేనే థియేటర్లకు వస్తున్నారు తప్పితే.. స్టార్ స్టేటస్ బట్టి థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యే రోజులు పోయాయి. భవిష్యత్ లో ఉండవు కూడా. కానీ.. ఈ విషయం “సరిలేరు నీకెవ్వరు” టీం కి ఎందుకు అర్ధం కావడం లేదు అనేది మాత్రం పెద్ద సస్పెన్స్. ఒకపక్క సంక్రాంతికి రిలీజవుతున్న “అల వైకుంఠపురములో” సినిమా ప్రమోషన్స్ విషయంలో బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే.. మరోవైపు ఆదేరోజు విడుదలకు సిద్ధమవుతున్న “సరిలేరు నీకెవ్వరు” మాత్రం ఇప్పటివరకూ టీజర్ మినహా మరో ప్రమోషనల్ ఐటెమ్ ను రిలీజ్ చేయకపోవడం గమనార్హం.
దీపావళికి విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” పోస్టర్లకు కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక అనిల్ రావిపూడి రిలీజ్ చేయించిన “క్రైమ్ బ్యాచ్ కోటి & అసిస్టెంట్ కిషోర్ రిపోర్టింగ్ ఫ్రమ్ సరిలేరు నీకెవ్వరు సెట్స్” వీడియోకి కనీసం 25 వేల వ్యూస్ కూడా రాకపోవడం బట్టి.. కనీసం మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆ ప్రమోషనల్ వీడియో చూడలేదని అర్ధమవుతోంది. అయినా.. టీజర్ లేదా సాంగ్ రిలీజ్ చేయాల్సిన టైమ్ లో ఇలా స్కిట్లు రిలీజ్ చేస్తే ఇలా ఉంటుంది. మరి అనిల్ రావిపూడి ఇప్పుడైనా ప్రమోషన్స్ మీద దృష్టి సారిస్తే బాగుండు.