NBK అంటే నందమూరి బాలకృష్ణ కాదా… మరి ఇంకేంటి అనుకుంటున్నారా? మామూలుగా అయితే అదే… కానీ యువ దర్శకుడు అనీల్ రావిపూడి NBK కి కొత్త భాష్యం చెప్పబోతున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ ఇదే చర్చ నడుస్తోంది. బాలకృష్ణ – అనీల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుంది అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మధ్య ఆగిన ఈ ముచ్చట… మళ్లీ మొదలైంది. అయితే ఈసారి కొంగొత్తగా.‘రామారావుగారూ..’ అంటూ కొన్ని నెలల క్రితం ఓ సినిమా పేరు టాలీవుడ్లో వినిపించింది.
నందమూరి బాలకృష్ణ – అనీల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అనీల్ కూడా సినిమా చేస్తాం అని చెప్పారు. కానీ ఈలోగా వేరే సినిమాలు ఓకే అవుతూ వచ్చాయి. అయితే ఆ సినిమా పేరును రవితేజ వాడేసుకున్నారు. దీంతో ఆ సినిమా లేదని అనుకున్నారు.తాజాగా టాలీవుడ్లో NBK అనే కొత్త పేరు చర్చలోకి వచ్చింది. బాలయ్యను మూడు పాత్రల్లో చూపిస్తే ఈ సినిమా ఉంటుందని టాక్.
అంటే ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు బాలకృష్ణలను చూడొచ్చు. వారి పేర్లలో తొలి అక్షరాలు N.. B.. K.. కలిసి సినిమాకు NBK అని పెట్టాలని అనుకుంటున్నారట. మరి ఆ కథేంటి, వారి పేర్లేంటి అనేది త్వరలో తెలుస్తుంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!