Anil Sunkara: కేసులతో ఇబ్బంది పెట్టగలరు.. కానీ భయపెట్టలేరు: అనిల్ సుంకర
February 16, 2024 / 01:12 PM IST
|Follow Us
సినిమా కష్టాలు అంటే… సినిమాల్లోని కష్టాలు అనుకుంటుంటారు. అయితే సినిమా వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. అలాంటి సినిమా కష్టాల్ని అనుభవించి దాటొచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి ఓ కష్టాన్ని ప్రస్తుతం ఫేస్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన కొన్ని సినిమాల ఫలితాల వల్ల ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఎక్కడో చిన్న ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో ఓ సినిమా కారణంగా వచ్చిన సమస్య… ఇప్పుడు కొత్త సినిమాలను ఇబ్బందిపెడుతోంది.
అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులతో తనను ఇబ్బంది పెట్టగలరేమో కానీ.. భయపెట్టలేరు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఈ రోజు విడుదలైన ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అయితే ఆ సినిమా విడుదలను ఆపేయాలంటే కోర్టుకెక్కారు. దీంతోనే పై వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొంది . తొలుత రిలీజ్ డేట్ కష్టాలు రాగా, ఆ తర్వాత లీగల్ కష్టాలు ఎదురయ్యాయి.
ఫైనల్‌గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది. సెన్సార్ సెర్టిఫికెట్ లేకుండానే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు ప్రీమియర్ షోలను ఏర్పాటు చేశారని, షోలను నిలిపివేయాలని కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఆ తర్వాత ‘ఏజెంట్’ సినిమా సమయంలో నష్టాలు రావడంతో ‘ఊరు పేరు భైరవకోన’ ప్రసార హక్కులకు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని… అయితే దానిని నిర్మాత ఫాలో అవ్వలేదని ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టు మెట్లెక్కారు. ఆ సంగతి కూడా తేల్చుకుని సినిమాను రిలీజ్ చేశారు. వీటి గురించి అనిల్ మాట్లాడుతూ ‘‘నా నుండి సినిమా కొన్న ఒకరు నష్టపోయారు.
నాన్ రిఫండెబుల్ అడ్వాన్స్ ఇచ్చి సినిమాను కొన్నారు. దీని బట్టి నేను డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు అనిల్ సుంకర. మానవత్వంతో ఆలోచించి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పిన అనిల్ సుంకర… ప్రతి బిజినెస్‌లో లాభం, నష్టం కామన్‌గా ఉంటాయన్నారు. లాభాలు వచ్చినప్పుడు మొత్తం నాదే అనుకుని, నష్టం వచ్చినప్పుడు వేరే వారిపై తోసేయడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన. మీరు నన్ను ఇలాంటి కేసులతో ఇబ్బంది పెట్టొచ్చు. కానీ భయపెట్టలేరు అని కేసులు పెడుతున్న వారిపై ఫైరయ్యారు (Anil Sunkara) అనిల్ సుంకర.