Anjali: శంకర్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారా..?

  • August 11, 2021 / 12:03 PM IST

తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది అంజలి. తెలుగులో కూడా హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. అయితే ఈమెకి సినీ అవకాశాలు తగ్గాయనుకున్న సమయంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ అందుకుంది సమాచారం. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం అంజలిని తీసుకున్నారట.

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇందులో హీరోయిన్ కి సమాంతరంగా ఓ కీలకపాత్ర ఉందట. ఆ రోల్ అంజలికి దక్కిందని తెలుస్తోంది. తమిళ చిత్రాల్లో నటించిన అంజలి గురించి తెలిసిన శంకర్.. ఆమెని పిలిచి మరీ ఈ ఆఫర్ ఇచ్చారట. ఇదే గనుక నిజమైతే.. అంజలి కెరీర్ ఊపందుకోవడం ఖాయం. ఇప్పటికే ఆమె తెలుగులో ‘ఎఫ్ 3’ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతుంది.

అలానే మలయాళ సినిమా ‘నాయట్టు’ తెలుగు రీమేక్ లో మెయిన్ రోల్ కోసం అంజలిని తీసుకున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus