రాజ్ తరుణ్ చుట్టూ తిరుగుతున్న అంజలి

  • October 11, 2017 / 06:54 AM IST

హెడ్డింగ్ చూసి అంజలి ఏంటి కుర్ర హీరో రాజ్ తరుణ్ చుట్టూ తిరగడమేంటీ అని తెగ ఆలోచించేస్తున్నారా? మీరు చదివింది నిజమే కానీ.. అది నిజజీవితంలో కాదు రీల్ లైఫ్ వరకే. విషయం ఏంటంటే.. అంజలి గత రెండేళ్ల నుండి నటిస్తున్న తెలుగు-తమిళ్ బైలింగువల్ మూవీ “బెలూన్”లో రాజ్ తరుణ్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యపాత్ర కంటే టైటిల్ రోల్ అని చెప్పొచ్చు.. సినిమాలో బెలూన్ మ్యాన్ గా కనిపించి భయపెట్టేది రాజ్ తరుణే. ఈ సినిమాతో రాజ్ తరుణ్ తమిళ్ లోనూ డెబ్యూ చేస్తున్నాడు. కథ మొత్తం రాజ్ తరుణ్ పోషిస్తున్న బెలూన్ మ్యాన్ చుట్టూనే తిరుగుతుందట.

సినిష్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ హారర్ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. జర్నీ ఫేమ్ జై కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రమోషన్స్ ఈమధ్య మొదలయ్యాయ్. నవంబర్ 3న తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవ్వనున్న ఈ చిత్రం అంజలి ఆఖరి సినిమా అని కూడా వినికిడి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత అంజలి తాను కొంత కాలంగా లిన్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న జై ని పెళ్లాడి సినిమాలకు స్వస్తి పలకనుందని తమిళ సినీవర్గాల టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ముందు ఈ “బెలూన్” ఎంత ఎత్తు ఎగురుతుందో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus