అమ్మ కోసం.. మెగా బ్రదర్స్ కలిసి.. ఘనంగా అంజనా దేవి బర్త్ డే సంబరాలు!
January 30, 2021 / 11:53 AM IST
|Follow Us
మెగా ఫ్యామిలీలో హీరోలు ఒకరి తరువాత మరొకరు స్టార్ డమ్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. ప్రతి ఒక్కరు వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్నారనే చెప్పాలి. అయితే ఎవరి స్థాయి ఎలా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి హీరోలంతా సింపుల్ గా కనిపిస్తారు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ లలో కూడా అందరూ చాలా ఈక్వల్ గా ఉంటారు. చిన్న బర్త్ డే పార్టీ అయినా కూడా కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు.
ఇక ఇటీవల మెగాఫ్యామిలీ వృక్షానికి ప్రాణంపోసిన మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజును హ్యాపీగా సెలబ్రెట్ చేసుకున్నారు. కోవిడ్ వలన ఎక్కువమంది రాలేదు. కానీ మెగా బ్రదర్స్ అంతా ఒక చోట చేరి అమ్మ పుట్టినరోజు వేడుకను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు , వారి దంపతులు అలాగే వారి సోదరిమణులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అంజనా దేవితో దిగిన ఒక ఫ్యామిలీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నాగబాబు సోషల్ మీడియా ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు. మనకు అనంతమైన సంతోషాన్ని ఇచ్చేవారు కొంతమందే ఉంటారు.. కొన్ని క్షణాలను సెలబ్రేట్ చేసుకోడానికి చాలా బాగుంటాయి.. ఈ రోజున మేము ఇలా హ్యాపీగా ఉండడానికి కారణం నువ్వే అమ్మ.. నీ పుట్టిన రోజు అంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పండగ అమ్మ.. అంటూ పోస్ట్ చేసాడు నాగబాబు.