భారతజట్టు విశ్వవిజేతగా ఆవివర్భంచిన అసాధారణ 1983 ప్రపంచకప్ క్రికెట్ ప్రయాణం ఆధారంగా రూపొందిన `83` చిత్రాన్నిరిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న అక్కినేని నాగార్జున
భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఆ ఏడాది కపిల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించింది. ఈ ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై `83` సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్‌వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. `83` చిత్రాన్నిఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగులో `83` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “క్రికెట్ జగత్తులో 1983లో మన దేశం గొప్ప విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మన దేశంలో క్రికెట్ ఓ మతం అనేంత గొప్పగా మమేకమైంది. ఈ ప్రయాణం గురించి చెప్పే చిత్రమే `83`. ఈ జర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ ప్రపంచంలో విశ్వవిజేత ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించి భారతదేశం తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది“ అన్నారు.
దర్శకుడు కబీర్‌ఖాన్ మాట్లాడుతూ – “ఓ ఫిలిం మేకర్‌గా నాగార్జునగారంటే నాకు ఎంతో గౌరవం. మా సినిమాను అంత గొప్ప వ్యక్తి సహాకారంతో తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. `83` చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది“ అన్నారు.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాసిస్ సర్కార్ మాట్లాడుతూ “83 సినిమాను అన్నపూర్ణ స్టూడియో సంస్థతో కలిసి విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అక్కినేని నాగార్జునగారితో కలిసి ఈ సినిమాను విడుదల చేయడం హ్యాపీ. ఆయన సపోర్ట్‌తో ఈ సినిమా రీచ్ బాగా ఉంటుందనడంలో సందేహమే లేదు. `83` మూవీ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంటర్‌టైన్ చేస్తుంది. పాన్ ఇండియా లెవల్లో సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
గ్లోబల్ సినిమా ఈ సినిమాను నైజాం ఏరియాలో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, మహీందర్ అమర్‌నాథ్‌గా షకీబ్ సలీమ్, బల్వీందర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్, సయ్యద్ కిర్మాణిగా సాహిల్ కత్తార్, దిలీప్ వెంగ్‌సర్కార్‌గా అదినాథ్ కొతారి, రవిశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేకర్ శర్మ, యశ్‌పాల్ శర్మగా జతిన్ శర్నా, రోజర్ బన్నిగా నిశాంత్ దహియా, సునీల్ వాల్సన్‌గా ఆర్.బద్రి, ఫరూక్ ఇంజనీర్‌గా బోమన్ ఇరాని, పి.ఆర్.మన్‌సింగ్‌గా పంకజ్ త్రిపాఠిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొనె నటిస్తున్నారు.
పదశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గ్రహీత దివంగత నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు 1975లో హైదరాబాద్ నడిబొడ్డున 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించారు. ఈ సంస్థలో 38 సినిమాలను నిర్మించారు. 23 సినిమాలు అవార్డులను కూడా అందుకున్నాయి. 2658 సినిమాల నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్ తన వంతు పాత్రను పోషించింది.
India won its first world cup in 83 &we still get goose bumps when we think of that moment. Very happy to present the Telugu version of the film 83.#ThisIs83@RanveerOfficial @kabirkhankk @AnnapurnaStdios @deepikapadukone @Shibasishsarkar @ipritamofficial @vishinduri @RelianceEnt pic.twitter.com/2aT1XlbcKj
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 23, 2020
India won the world cup in ‘83, and we still get goose bumps when we think it!@AnnapurnaStdios is extremely happy to present the Telugu version of the film ‘83. #ThisIs83@RanveerOfficial @kabirkhankk @iamnagarjuna @deepikapadukone @Shibasishsarkar @ipritamofficial @vishinduri pic.twitter.com/lUpkET5s7t
— Annapurna Studios (@AnnapurnaStdios) January 23, 2020