Adipurush Movie: ‘ఆదిపురుష్’ లో కీలక పాత్రకు సంబంధించిన అప్డేట్..!

  • June 24, 2021 / 04:44 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి.రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘తానాజీ’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు.రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా కనిపించబోతున్నాడు. ఇక అతని పక్కన సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కనిపించనుంది. ప్రభాస్ ను ఢీ కొట్టే.. విలన్ రావణ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.

ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వడం.. కొంత భాగాన్ని చిత్రీకరించడం జరిగింది. ముంబైలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో..’ఆదిపురుష్’ టీం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యి రామోజీ ఫిలింసిటీలో సెట్ వేసి షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు కానీ ఇక్కడ కూడా కరోనా విజృంభించడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. ఇక ఆగష్టు నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతారా?

లేక ముంబైలో చిత్రీకరణ జరుపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా… త్వరలోనే ‘ఆదిపురుష్’ కు సంబంధించి ఓ భారీ అనౌన్స్మెంట్ రానుందట. ఇది హనుమంతుడు పాత్ర గురించి అయ్యి ఉంటుంది అని ఇన్సైడ్ టాక్. ‘ఆదిపురుష్’ మూవీకి అత్యంత కీలకమైన ఈ పాత్రని ఎవరు పోషించబోతున్నారు? అనే విషయం పై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus