‘కాంతార’ యాక్టర్ – డైరెక్టర్ రిషబ్ శెట్టి అందుకోబోతున్న ఆ అవార్డ్ ఏంటంటే..?
February 16, 2023 / 04:49 PM IST
|Follow Us
‘కాంతార’ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. శాండల్ వుడ్లో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. బాలీవుడ్లో కూడా ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం.. ‘కెజీఎఫ్’ తర్వాత యావత్ ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమ వైపు తిప్పిందీ చిత్రం.. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించగా.. ‘కెజీఎఫ్’ నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు.
తెలుగులో ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా లాభాలను అందించింది.. కర్ణాటకకు చెందిన ప్రాచీన కళ అయినటు వంటి భూత కోలా అనే ఎపిసోడ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. రిషబ్ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు ప్రేక్షకులు. ‘కాంతార’ చిత్రం మొదటి సారి స్టార్ మా లో టెలికాస్ట్ అయినప్పుడు 14.6 టి.ఆర్.పి రేటింగ్ సాధించడం విశేషం..
ఇంతటి జనాదరణ పొందిన సినిమా సరైన ప్రమోషన్ లేని కారణంగా ఆస్కార్‌కి నామినేట్ కాలేకపోయిందని.. ప్రీక్వెల్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు.. ‘కాంతార’ కు ప్రీక్వెల్ చేస్తున్నట్టు రిషబ్ శెట్టి ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కాంతార’ మేకింగ్ లాంటిదని.. ‘కాంతార’ ప్రీక్వెల్ అంతుకుమించి ఉంటుందని అంచనాలు పెంచేశాడు.
ఇప్పటికే పలు ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న ‘కాంతార’ చిత్రానికి సంబంధించి యాక్టర్, డైరెక్టర్ రిషబ్ శెట్టిని మరో అవార్డ్ వరించింది.. 2023 ఏడాదికి గానూ ‘ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్’ గా రిషబ్ ఎంపికయ్యాడు.. ఈ అవార్డును దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సీఈవో మిశ్రా వెల్లడించారు. ఈ నెల 20న ముంబైలో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రిషబ్ ఈ అరుదైన ఘనత సాధించడం పట్ల కన్నడ చిత్ర సీమ సంతోషం వ్యక్తం చేస్తోంది..