Mahesh Babu: మహేష్ సినిమాలో మరో హీరో

  • May 14, 2021 / 01:44 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి విభిన్నమైన సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం చేస్తున్న సినిమా కాబట్టి బడ్జెట్ లెక్కలు గట్టిగానే పెరిగాయి. ఇక అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉండేలా త్రివిక్రమ్ ప్రతి విషయంలోను హై లెవెల్లోనే ఆలోచిస్తున్నాడట.

ఇక సినిమాలో ఇక ముఖ్యమైన పాత్ర కోసం ఒక సీనియర్ హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. అక్కినేని వారి మేనల్లుడు సుమంత్. ఇదివరకే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల.. వైకుంఠపురములో సుశాంత్ ను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు మరొక ముఖ్యమైన పాత్ర కోసం SSMB 28కు అదే ఫ్యామిలీ నుంచి సుమంత్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పాత్రకు సుమంత్ గ్రీన్ సిగ్నక్ ఇచ్చాడా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

ఇక హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో పోటీగా నిలవాలని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus