సప్తగిరి ఖాతాలో మరో హిట్ సాంగ్ !!!

  • July 20, 2021 / 07:45 PM IST

ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో సప్తగిరి హీరోగా నటిస్తున్న గూడుపుఠాని సినిమాను కె.ఎమ్. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని నీలి నింగి తాకాలని అనే మెలోడీ సాంగ్ ను సింగర్ సునీత ఆలపించారు. ఈ సాంగ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉండడం విశేషం. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమా కు ప్రతాప్ విద్య సంగీతం అందిస్తుండగా బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్.

త్వరలో ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర యూనిట్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతొందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus