గ్యాంగ్‌స్టర్‌ గురించి ఏమేం చూపిస్తారో….

  • November 16, 2021 / 03:53 PM IST

గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవితాధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలొచ్చాయి. అయితే వాటి నిర్మాణం, స్క్రీన్‌ప్లే, పాత్రల ఎంపిక లాంటి విషయాల్లో సరైన ఎంపిక చేయలేక థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. తాజాగా మరోసారి నయీం జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా పేరే ‘నయూం డైరీస్‌’. దాము బాలాజీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వశిష్ట సింహ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల దర్శకుడు సంపత్‌ నంది హైదరాబాద్‌లో విడుదల చేశారు.

అనంతరం సినిమా గురించి మాట్లాడారు. నిజ జీవిత కథలతో సినిమాలు చేస్తున్నప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని చెప్పుకొచ్చారు. నయీం లొంగిపోయిన తర్వాత పోలీసులు, రాజకీయ నాయకులు అతన్ని వాడుకుని నక్సలైట్లను అంతమొందించారు. ఆ విషయాన్ని సినిమాలో చూపిస్తాం అని దర్శకుడు దాము బాలాజీ చెప్పారు. ముల్లును ముల్లుతోనే తీయాలని ఆనాడు పోలీసులు ప్రయత్నించారు. అయితే నయీం ఎందుకు క్రిమినల్‌గా మారాడు, అతన్ని మించిన నేరస్థులు సమాజంలో ఎవరైనా ఉన్నారా?

అన్నది సినిమాలో చూపిస్తామని దర్శకుడు అంటున్నాడు. నయీం గురించి ఆ మధ్య పేపర్‌లో చదవడం, టీవీల్లో చూడటమే. ఇప్పుడు ఆ అంశాలు, వాటి వెనుక ఉన్న అంశాలు తెర మీద చూపిస్తాం అంటున్నారు. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus