నితిన్ సినిమా నుండి మరో టెక్నీషియన్ జంప్!

  • March 21, 2016 / 08:08 AM IST

నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అ ఆ..'(అనసూయ రామలింగం..ఆనంద్ విహారి). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఏ ముహూర్తాన.. మొదలయిందో గానీ అడుగడుగునా.. ఆటంకాలే. అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాకుండా వెనక్కి వెళుతోంది. రోజుకో టెక్నీషియన్ ఈ సినిమా నుండి జారుకుంటున్నాడు.

ముందుగా సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమా నుండి తప్పుకునాడు. ఆ తరువాత ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ కూడా మధ్యలో వెళ్ళిపోయాడు. రీసెంట్ గా ఈ చిత్ర సినిమాటోగ్రఫర్ నట్టి అలియాస్ నటరాజన్ కూడా సినిమా నుండి తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డుడ్లే ను నటరాజన్ స్థానంలోకి తీసుకున్నట్లుగా సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus