Pushpa 2: ఈసారి మరో టైటిల్ ?

  • May 18, 2021 / 03:57 PM IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడో గాని ప్రస్తుతం వస్తున్న గాసిప్స్ డోస్ మాత్రం మామూలుగా లేదు. సినిమా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో అంతకు మించి అనేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నట్లు నిర్మాతలు క్లారటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

సినిమా బడ్జెట్ తో పాటు పాత్రలు కూడా పెరుగుతాయని పార్ట్ 2లో అల్లు అర్జున్ మరింత డిఫరెంట్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక టైటిల్ విషయంలో కూడా దర్శకుడు సుకుమార్ మరొక ఆప్షన్ పెట్టుకున్నట్లు సమాచారం. పుష్ప అని కాకుండా మరొక విభిన్నమైన టైటిల్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అందుకు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన అన్ని సాంగ్స్ ను కంపోజ్ చేసినట్లు సమాచారం. పార్ట్ 2 కోసం కూడా అప్పుడే కంపోజింగ్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus