సైంటిస్ట్ ‘దేవ్’ పాత్రలో వరుణ్ అదుర్స్!

  • December 15, 2018 / 07:58 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి, అదితి రావ్ హైదరి హీరోన్లుగా వస్తున్న తాజా చిత్రం ‘అంతరిక్షం’. ‘ఘాజీ’ లాంటి చిత్రంతో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 21 న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది.

ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ వారు ‘యు’ సర్టిఫికెట్ ను జారీ చేసారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్’ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లు సినిమా పై అంచనాలను పెంచేసాయి. సైంటిస్ట్ దేవ్ గా వరుణ్ ఈ చిత్రంలో మంచి ప్రతిభను చూపించాడట. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలువనుందట.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus