ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అను ఇమ్యానుయేల్!
September 18, 2018 / 11:01 AM IST
|Follow Us
మజ్ను… కిట్టు ఉన్నాడు జాగ్రత్త… అజ్ఞాతవాసి…నా పేరు సూర్య.. ఇలా అను ఇమ్యానుయేల్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెకు ఐరెన్ లెగ్ గర్ల్ అని పేరు పెట్టేసారు. దర్శకనిర్మాతలు ఆమె పేరు చెబితేనే బయపడేస్థాయికి వచ్చింది. అలాంటి క్లిష్టపరిస్థితిలోంచి అను ని శైలజారెడ్డి అల్లుడు బయటపడేశాడు. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. దీంతో అను ఇమ్యానుయేల్ పై ఉన్న ఒత్తిడి మొత్తం ఎగిరిపోయింది. ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు తమిళ హీరో ధనుష్, కింగ్ నాగార్జున చేస్తున్న మల్టీ స్టారర్ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమా కోసం సిద్ధమవుతున్న అనును ప్రేమ, పెళ్లి విషయాల గురించి అడగగా.. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. “నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే ఆకర్షణకు గురయ్యాను. అప్పుడు నాకు ఏమీ తెలియదు. పెద్దయ్యాక నా మనసుకు నచ్చిన వ్యక్తికోసం వెతుకుతున్నాను. ఇద్దరి మనసులు కలయిక అనేది ఓ అద్భుతం. ఆ అద్భుతం నా లైఫ్ లో ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురుచూస్తున్నాను. కాస్త లేటైనా పేమ వివాహమే చేసుకుంటాను” అని మనసులోని మాటని బయటపెట్టింది. మరి అను మనసును గెలుచుకునే రాకుమారుడు ఎక్కడున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.