రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘అనుభవించు రాజా’. నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ లభించింది.దాంతో వీకెండ్ వరకు ఈ చిత్రం పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం స్లీపేసింది. నిన్న బాలయ్య- బోయపాటి ల ‘అఖండ’ రిలీజ్ అవ్వడంతో ఈ చిత్రాన్ని పట్టించుకున్నవాళ్ళే లేరు.
ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.67 cr |
సీడెడ్ | 0.38 cr |
ఉత్తరాంధ్ర | 0.23 cr |
ఈస్ట్ | 0.17 cr |
వెస్ట్ | 0.12 cr |
గుంటూరు | 0.17 cr |
కృష్ణా | 0.13 cr |
నెల్లూరు | 0.11 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.98 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.07 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.11 cr |
‘అనుభవించు రాజా’ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.11 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.89 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘అఖండ’ ఎంట్రీ తో ఇక ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!