అనుపమ పరమేశ్వరన్ గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!
November 9, 2016 / 03:06 PM IST
|Follow Us
అలల్లా జాలువారే ఉంగరాల జుట్టు.. చక్కని మోము.. అమృతం లాంటి గొంతు అనుపమ పరమేశ్వరన్ సొంతం. తెలుగులో అ ఆ సినిమాతో అడుగుపెట్టినా… అప్పటికే కేరళలో యువకుల గుండెల్లో అలజడి రేపింది. తాజాగా ప్రేమమ్ తో ఇక్కడి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది కేరళ కుట్టీ. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్..
1. కేరళ కుట్టీఅనుపమ స్వస్థలం త్రిసూర్ జిల్లాలోని ఇరుంగళకుడ (కేరళ). తండ్రి పరమేశ్వరన్ విదేశాల్లో ఉద్యోగం చేస్తారు. అమ్మ సుజాత గృహిణి.
2. ఐశ్వర్య వీరాభిమానిబెస్ట్ స్టూడెంట్ అనుపమ. చిన్నతనం నుంచీ బాగా చదివేది. మార్కులూ బాగా వచ్చేవి. అయినా సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణెకి వీరాభిమాని.
3. సెల్ ఫోన్ ఫోటోలుప్లస్ వన్ చదువుతున్న అనుపమకు ‘ఓ చిత్రానికి కథానాయిక కావాలి. ఆసక్తి ఉన్నవారు ఫొటోలు పంపండి’ అని పేపర్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. స్నేహితురాళ్లు సెల్ఫోనులో తీసిన ఫొటోలను పంపించింది. అలా కష్టపడకుండకుండానే అనుపమను ప్రేమమ్ అవకాశం వరించింది.
4. మేరీ జార్జ్ గా మొదటి అడుగుమలయాళంలో నిర్మితమయిన ‘ప్రేమమ్’లో అనుపమ విద్యార్థిని మేరీ జార్జ్ పాత్ర పోషించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయి అనుపమను డ్రీమ్ గర్ల్ చేసింది.
5. సొంతంగా డబ్బింగ్అనుపమ తెలుగులో చేసిన మొదటి సినిమా అ..ఆ. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాగవల్లి పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె నటనతో పాటు వాయిస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
6. తెలుగు ‘ప్రేమమ్’లో సుమఅ ఆ చిత్రీకరిస్తున్నప్పుడే అనుపమకు తెలుగు ‘ప్రేమమ్’లో నటించే అకాశం వచ్చింది. నాగచైతన్య పక్కన సుమ రోల్ లో మైమరపించింది.
7. మూడు భాషల్లో బిజీకేరళ కుట్టీ మాతృభాషతో పాటు తెలుగులో నటించిన చిత్రాలు హిట్ కావడంతో దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్ అయింది. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘శతమానం భవతి’ సినిమాలో నటిస్తోంది. తమిళం, మలయాళంలోనూ మరో రెండు చిత్రాలు చేస్తోంది.
8. చదువుకి బ్రేక్ఇంటర్ మాత్రమే పూర్తి చేసిన అనుపమ సినీ అవకాసాల వల్ల డిగ్రీని కొనసాగించలేకపోయింది. కెరీర్ లో బిజీ తగ్గిన తగిన తర్వాత ఎలాగైనా డిగ్రీ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంది.
9. బిర్యానీ ఇష్టంఅనుపమకు భాగ్యనగరమే కాదు.. ఇక్కడ లభించే బిర్యానీ అంటే భలే ఇష్టం. ఉప్మా పెసరెట్టు ఆమె ఫేవరేట్.
10. వైల్డ్ ఫోటోగ్రాఫర్నటి కాకపోయింటే అనుపమ కెమెరా పట్టి వన్యప్రాణుల ఫోటోలను తీసేది. ప్రపంచ దేశాలు చుడుతూ పర్యావరణాన్ని కెమెరాలో బంధించేది.