Anupama Parameswaran: అనుపమ ప్రెగ్నెంట్ ఫొటో వైరల్!

  • January 31, 2022 / 03:10 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల అందరిని ఎక్కువగా ఆశ్చర్యపరిచిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. రౌడి బాయ్స్ సినిమాలో అనుపమ కనిపించిన విధానం ఒక్కసారిగా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. ఆ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా ఒక టాక్ అయితే వచ్చింది. ఇక అనుపమ రానున్న రోజుల్లో కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమేనా అన్నట్లుగా హింట్ కూడా ఇచ్చినట్టు టాక్ వచ్చింది.

ఇక సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో విభిన్నమైన ఫొటోలను పోస్ట్ చేస్తున్న అనుపమ తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. ఇక రీసెంట్ గా ఆమె కదుపుతో ఉన్నట్లుగా ఒక ఫొటోను పోస్ట్ చేసింది. పక్కన తన తండ్రి పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఇక అదొక బ్యూటీఫుల్ ఫొటో అంటూ అనుపమ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఫొటో వివరాల్లోకి వెళితే 2020లో అనుపమ నటించిన మనియారాయిలే అశోకన్ అనే మలయాళం సినిమాలో ఇలా ప్రెగ్నెంట్ గా కనిపించింది.

ఆ సినిమా కోవిడ్ పాండమిక్ కారణంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫొటోను అనుపమ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో మొదట కొందరు ఆశ్చర్యపోయారు. అనుపమ హఠాత్తుగా కడుపుతో కనిపించడం ఏమిటని అనుకున్నారు. ఇక అది ఆమె మలయాళం సినిమాలోని పాత్ర అని చెప్పడంతో అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాకి అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేయడం విశేషం.

నటిగా తనను తాను ఎప్పటికి సరికోత్తగా ప్రజెంట్ చేసుకుంటున్న అనుపమ ఇటీవల రౌడి బాయ్స్ సినిమాలో కాస్త రొమాన్స్ డోస్ పెంచింది. అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం అమ్మడు 18 పెజెస్, కార్తికేయ 2 సినిమాలతో బిజీగా ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus