Anupama: హోం ఐసోలేషన్ లో అనుపమ పరమేశ్వరన్!

  • August 25, 2022 / 01:47 PM IST

సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ.. నితిన్ హీరోగా నటించిన అఆ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం అనుపమ తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోయింది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వార అనుపమ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందింది. ఇటీవల అనుపమ కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది.

ఇటీవల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకటంతో అనుపమ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్ కి జోడిగా అనుపమ నటించిన 18 పేజేస్‌ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన కార్తీకేయ 2 సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరొకరి జోడిగా 18 పేజేస్‌ సినిమాలో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి. ఈమె ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటుంది. అయితే ఈమె ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందని కంగారు పడాల్సిన పని లేదని తెలిపారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus