అనురాగ్ కశ్యప్ పై ట్రోలింగ్..!

  • August 17, 2022 / 06:53 PM IST

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తరువాత కొన్ని కమర్షియల్ సినిమాల్లో కనిపించింది. ఒకట్రెండు హిట్స్ వచ్చినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. దీంతో మెల్లగా బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ.. క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె నటించిన ‘దొబారా’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను రూపొందించారు. తాప్సీతో ఆయనకు మూడో సినిమా ఇది. ఇంతకు ముందు ‘మన్మర్జియాన్’, ‘సాండ్ కి ఆంఖ్’ సినిమాలు తీశారు. ఈ సినిమాలో తాప్సీ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనురాగ్ తో కలిసి తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా యాంకర్.. రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ పై మీ అభిప్రాయం ఏంటని..? అనురాగ్ కశ్యప్ ని ప్రశ్నించగా.. దానికి ఆయన బాలీవుడ్ లో ఇలాంటివి కామన్ అని అన్నారు.

వెంటనే యాంకర్.. ‘అయితే మీరు కూడా ట్రై చేస్తారా..?’ అని అడిగారు. మధ్యలో తాప్సీ రియాక్ట్ అవుతూ.. ‘ప్లీజ్.. హారర్ సినిమా చూపిస్తారా..? ఏంటి’ అని చమత్కరించింది. తాప్సీ కామెంట్స్‌కు రియాక్ట్‌ అయిన దర్శకుడు అనురాగ్‌.. ‘నువ్వెందుకు భయపడుతున్నావ్‌.. హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయి.. అందుకే తను అసూయ పడుతుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనురాగ్ కామెంట్స్ కి ఇబ్బంది పడ్డ తాప్సీ.. సింపుల్ గా నవ్వి ఊరుకుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్ తో అనురాగ్ అంత అసభ్యంగా కామెంట్స్ చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై అనురాగ్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. బాలాజీ టెలిఫిల్మ్స్, సునీర్ ఖేటర్‌పాల్, గౌరవ్ బోస్ (ఎథీనా) ఆధ్వర్యంలోని కొత్త వింగ్ అయిన శోభా కపూర్ అండ్ ఏక్తా ఆర్ కపూర్‌ల కల్ట్ మూవీస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus