దక్షిణాది చిత్ర సీమలో స్వీటీ అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నాలు టాప్ హీరోయిన్స్ గా పేరుతెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బాహుబలిలో వీరిద్దరూ హీరోయిన్స్ గా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఏర్పరుచుకున్నారు. తమన్నా, అనుష్కల అభినయం బాహుబలి బిగినింగ్ విజయానికి దోహదం చేశాయి. బాహుబలి కంక్లూజన్ లోను ఈ ముద్దుగుమ్మలు ఆకట్టుకోనున్నారు. ఇప్పుడు మరో భారీ ప్రాజక్ట్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఏకకాలంలో నాలుగు భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు.
ఇందుకోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాపులర్ అయిన తారల గురించి ఆరా తీయగా అనుష్క, తమన్నా పేర్లు ముందు వరుసలో నిచినట్లు తెలిసింది. అందుకే వారిద్దరిని ఈ ప్రాజక్ట్ లో హీరోయిన్ గా గౌతమ్ మీనన్ ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఎవరో ఫిక్స్ చేయలేదు. ఈ మూవీ జులై నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.