సినిమానైనా వదిలేస్తా కానీ, ప్రభాస్ ని వదులుకోను..!
March 19, 2020 / 05:53 PM IST
|Follow Us
టాలీవుడ్ లో అనుష్క కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోయిన్ గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న అనుష్క వ్యక్తిత్వం, మాట తీరు, ఒదిగిఉండే తత్త్వం ఆమెకు మరింత గౌరవం తెచ్చిపెట్టాయి. హీరోలతో సమానమైన ఇమేజ్ కలిగి ఉన్న అనుష్క వ్యక్తిగత విషయాలపై కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. ఐతే అనుష్క పెళ్లి అనేది ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ టాపిక్. బాహుబలి విడుదల తరువాత నుండి ఈ టాపిక్ నడుస్తూనే ఉంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ప్రేక్షకులలో ఎంత ఆసక్తిని రగిలించిందో.. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే ప్రశ్న సైతం అంతే ఆసక్తిని ఆమె అభిమానులలో రగిలిస్తుంది.
ఇక ఎప్పటి నుండో అనుష్క ప్రభాస్ ని పెళ్లి చేసుకోనున్నారని జరుగుతున్న ప్రచారం. ఈ విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా ఇద్దరు ఖండించారు. మేము మంచి మిత్రులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. కానీ వీరిద్దరూ పెళ్లి మాట ఎత్తకపోవడం.. ఇంకా ఎక్కడో వీరు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారు అనిపిస్తుంది. ఇక తాజాగా ఓ టీవీ షో లో పాల్గొన్న అనుష్కను ప్రభాస్ లేదా సినిమా ఈ రెంటిలో ఒకరిని వదిలేయమని అడిగితే ఎవరిని వదిలేస్తారు? అని అడుగగా ఆలోచించకుండా సినిమా వదిలేస్తాను, ప్రభాస్ ని మాత్రం వదులుకోను అని ఆమె చెప్పారు. దీనితో ఎప్పటికైనా వీరిద్దరూ ఒక్కటవుతారనే సందేహం బలపడుతుంది.