అందుకే అనుష్క షూటింగ్ డుమ్మా కొడుతుందట..?

  • June 19, 2019 / 04:33 PM IST

వరుసగా టాలీవుడ్ లో సినీ నటులకు గాయలవుతూ వస్తుండడం ప్రేక్షకుల్లో ఆందోళన కలిగిస్తుంది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం హీరోలు ఎన్టీఆర్, చరణ్ కు గాయాలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నాని.. నాగ శౌర్య.. సందీప్ కిషన్.. శర్వానంద్ ఇలా యంగ్ హీరోలు కూడా గాయాలు పాలయ్యారు. దీంతో వీళ్ళు నటిస్తున్న సినిమాల షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క కూడా గాయాలు పాలయ్యిందని సమాచారం.

అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ డైరెక్షన్లో ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంతో పాటూ మెగాస్టార్ 151 వ చిత్రమైన ‘సైరా’ చిత్రంలో కూడా నటిస్తుంది. సైరా’ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో కాలి నెప్పితో బాధపడిందట అనుష్క. ఈ కాలి గాయం కారణంగా షూటింగ్ కు రెగ్యులర్ గా హాజరు కావడం లేదని సమాచారం. అయితే అనుష్క తన కాలికి గాయం అయిన విషయాన్ని రహస్యంగా ఉంచుతోందట. ‘సైలెన్స్’ చిత్రం మొదలైనప్పుడే అనుష్క బరువు తగ్గి స్లిమ్ గా మారింది. అయితే ఇప్పుడు తన కాలికి గాయం కారణంగా మళ్ళీ బరువు పెరిగిందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus